ETV Bharat / state

YCP Govt Vote Gambling: పథకం ప్రకారమే ఓట్ల జబ్లింగ్.. తప్పులున్నా సరిదిద్దని యంత్రాంగం - ఏపీ లేటెస్ట్ న్యూస్

YCP Govt Vote Gambling: కొంతకాలంగా ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల వ్యవహారం రాష్రంలో దుమారం రేపుతోంది. ఓటర్ల జాబితాను జంబ్లింగ్‌ చేయడం.. ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లోనివారి ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదుకు అధికార వైసీపీ పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదు చేశాయి. ఇదంతా చాలా ప్రణాళికాబద్ధంగా.. పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు విపక్ష పార్టీలు, పలువురు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 6, 2023, 10:49 AM IST

YCP Govt Vote Gambling: ఎన్నికల సంఘం నిబంధన 6 ప్రకారం ఇంటి నంబర్ల వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. అంటే.. అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తూ.. అనర్హులను చేర్చుతున్నారని అర్థమవుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇలాంటి ఉదంతంపై బందరు వాసి ఇమడాబత్తిని దిలీప్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమం, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ ఇలాగే ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

YCP Fake Voter ID Cards: వైసీపీ కక్కుర్తికి పరాకాష్ట.. 16ఏళ్లకే ఓటరు గుర్తింపు కార్డు..!

TDP votes deletion in AP: సాధారణంగా వీధిలో ఇంటి నంబర్లు ఒక వరుసలో ఉంటాయి. కానీ ప్రస్తుత జాబితాలో చాలా వరకు డోర్‌ నంబరు ఒకటి తర్వాత 40 లేదా 50 ఉంటోంది. ఆ నంబరు గురించి 1వ నంబరు ఇంట్లో విచారణ చేస్తే.. తమకు తెలియదని చెబుతారు. దీంతో ఆ ఓట్లను తొలగించేస్తారు. ప్రస్తుతం ఇదే విధంగా రాష్ట్రంలో దొంగ ఓట్ల ఆపరేషన్‌ జరుగుతుంది. దిలీప్‌కుమార్‌ అనే వ్యక్తి మొదట ఓటర్ల జాబితాలో అవకతవకలపై 2022 డిసెంబరు 6న నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన ఆర్డీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. మొత్తం 1,140 ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేరోజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2022 డిసెంబరు 8న ఓటర్ల జాబితా ముసాయిదా పూర్తయింది. కానీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తిరిగి ఆయన ఫిబ్రవరి 15న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Minister Seediri Appalaraju Controversial Comments: వైసీపీ మద్దతుదారుల ఓట్లైతే ఉంచెయ్‌.. వైరివర్గాల ఓట్లైతే.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Complaint on YCP Govt Vote Gambling: దిలీప్‌కుమార్‌ ఫిర్యాదుని రాష్ట్ర ఎన్నికల అధికారి కృష్ణా... కలెక్టర్‌కు ఎండార్సు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు, ఆర్డీఓ కిశోర్‌ను 2023 మార్చి 8న ఆదేశించారు. అభ్యంతరాలను బల్క్‌గా ఇవ్వడం వల్ల తాము ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేదంటూ దిలీప్‌కు లేఖ రాశారు. దీంతో ఆయన మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అతని ఫిర్యాదుకి అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Bogus Votes in AP : ' 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే'.. విచారణ చేపట్టిన అధికారులు

YCP Vote Gambling: కలెక్టర్, ఆర్డీఓ స్పందించకపోవడంతో దిలీప్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జూన్‌ 19న కోర్టు దాన్ని స్వీకరించింది. దీంతో అదేరోజు సీఈఓ మీడియా సమావేశం నిర్వహించి తాము ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. వాస్తవానికి జూన్‌ 1 నుంచే ఎస్‌ఎస్‌ఆర్‌ జరుగుతోంది. జూన్‌ 28న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానికి ఇచ్చిన అఫిడవిట్‌లో మచిలీపట్నంలో 1,140 ఓట్ల విషయంలో తప్పులు జరిగినట్లు ఆర్డీఓ అంగీకరించారు. ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌ రాజాబాబుకు ఆదేశాలు జారీ చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు.

Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!

Vote Gambling: వాస్తవానికి బందరు ఓటర్ల జాబితాలో ఎక్కడా ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేవు. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఉండాల్సిన ఓట్లు వేరే కేంద్రానికి మారాయి. ఇలాంటి ఓట్లు 455 ఉన్నట్లు దిలీప్‌కుమార్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 68 ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నట్లు గుర్తించారు. జాబితాలో ఇచ్చిన చిరునామాలో నివాసం ఉండని వారు 386 మంది ఉన్నారు. రెండుసార్లు నమోదైన ఓట్లు రెండు ఉండగా.. చనిపోయినా 24 మందిని జాబితాలోంచి తొలగించలేదని గుర్తించారు.

TDP votes deletion in AP: అయినా బాధ్యులపై చర్యలు లేకపోవడంపై దిలీప్‌కుమార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను జంబ్లింగ్‌ చేయడం, ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి మార్చడం, ఒకే ఇంట్లో ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో వచ్చేలా చేయడం, సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు వంటివి గత స్థానిక ఎన్నికల నుంచి ప్రయోగం చేసి విజయం సాధించారని దిలీప్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఇదంతా అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందని ఆరోపించారు. అందుకే దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశినట్లు దిలీప్‌కుమార్‌ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.