ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ... రాజకీయ పార్టీల ప్రలోభాల పర్వం వేగవంతమైంది. గుంటూరు జిల్లాలో వైకాపా తరఫున పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులు ... మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రలోభాలకు ప్రణాళికలు వేశారు. ఈ కామర్స్ వెబ్ సైట్లను ఓటర్లకు తాయిలాలు పంచే వేదికలుగా మార్చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో గృహోపకరణాలు బుక్ చేసి మహిళలకు అందివ్వడానికి సిద్ధమయ్యారు. గుంటూరుతో పాటు తెనాలి, చిలకలూరిపేట, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు... పెద్దసంఖ్యలో ప్రెషర్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు, ఇస్త్రీ పెట్టెలు పంపిణికి సిద్ధమయ్యారు. వీటీని నేరుగా పార్టీ తరఫున తీసుకెళ్లి ఇస్తే పోలీసులతో ఇబ్బందని....కొత్త తరహా ఎత్తుగడ వేశారు. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఆ వస్తువుల్ని ఓటర్లకు చేర్చాలని నిర్ణయించారు.
దీని కోసం రాజకీయ నాయకులు కొందరు వ్యక్తుల్ని నియమించుకుని అమెజాన్ ద్వారా గృహోపకరణ వస్తువులను పెద్దసంఖ్యలో బుక్ చేయించి...ఓటర్ల చిరునామాలకు చేరేలా ఉపాయం వేశారు. దీని కోసం పెద్ద సంఖ్యలో ఓటర్ల చిరునామాలు సేకరించటం... ఫలానా వస్తువు మీకు చేరుతుందని వారికి ముందుగానే చెప్పటం అన్నీ జరిగిపోయాయి. గుంటూరు జిల్లాలో ఆ సంస్థకు పది డెలివరీ పాయింట్లు ఉండగా...వాటి ద్వారా వస్తువుల్ని ఓటర్లకు చేర్చేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని అమెజాన్ సంస్థకు పెద్దమొత్తంలో ఆర్డర్లు వస్తున్నందున పోలీసులు సదరు సంస్థ ప్రతినిధుల్ని స్టేషన్‌కి పిలిపించి... కొందరు వ్యక్తుల నుంచే చెల్లింపులు జరగటంపై నిలదీశారు. ఈనెల 11న పోలింగ్ జరిగే వరకూ వాటిని పంపిణి చేయరాదని సంస్థ ప్రతినిధులని ఆదేశించారు
విషయం మెత్తం పోలీసులు పసిగట్టినందున.. సదరు పార్టీ అభ్యర్థులు సందిగ్ధంలో ముగినిపోయారు. ఈ ఆర్డర్ చేసిన వస్తువుల్లో కొన్నింటికి నగదు చెల్లింపులు కూడా చేసినట్లు సమాచారం. దీని ప్రభావంతో అభ్యర్థులు ఆర్డర్ రద్దు చేయాలా... వద్దా అనే సందేహంలో పడ్డారు.