ETV Bharat / state

వైకాపావి హత్యా రాజకీయాలు: లోకేశ్

వైకాపా ప్రభుత్వానివి హత్యా రాజకీయాలని మాజీ మంత్రి లోకేశ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన తెదేపా నేత ఉమాయాదవ్ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు.

మాజీ మంత్రి లోకేశ్
author img

By

Published : Jun 26, 2019, 7:59 PM IST

మాజీ మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం రాత్రి హత్యకు గురైన తెదేపా నేత ఉమాయాదవ్ మృతదేహానికి మాజీ మంత్రులు లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావులు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని లోకేశ్ భరోసానిచ్చారు. ఉమా యాదవ్ పిల్లలను తెదేపా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు చేయలేదన్నారు. 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలోనూ తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని గుర్తు చేశారు. తెదేపా కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. బిహార్ తరహా పాలనను ఇక్కడికి తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇదీచదవండి

పోలీసుల ఎదుట మంగళగిరి హత్యకేసు నిందితులు

Intro:ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. తిరుమలేశుడిని దర్శించుకున్న భక్తులు కొండపైగల ఉప దేవాలయాలు... శేషాచలం లోని తీర్థాలను సందర్శిస్తుంటారు. సందర్శనీయ ప్రాంతాల్లో శిలాతోరణం అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రీవారి ఆలయం కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా... ఈ ప్రాంతంలోనే చక్రతీర్థం కూడా ఉండడంతో అధిక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చేవారికి ఆధ్యాత్మికతతో పాటు వినోదం, విజ్ఞానంను పంచే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యానవనాలను అభివృద్ధి పరచడంతో పాటు... దేవతామూర్తుల ప్రతిరూపాలను సిద్దం చేశారు. విఘ్నేశ్వర స్వామి తో ప్రారంభించి దశావతారాలు, శ్రీమహావిష్ణువు, యోగ నరసింహస్వామి, అర్ధనారీశ్వరుడు, చిన్ని కృష్ణుడు, బ్రహ్మ, లక్ష్మీదేవి అమ్మ వారితో పాటు పలు ఆకృతులను ఏర్పాటు చేశారు. శేషాచలం కొండల్లో లభించే అరుదైన రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. రాత్రి దాని ప్రత్యేకతను తెలిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిలాతోరణం కు పక్కనే ఉన్న పార్కును పది లక్షల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నారు. ఉద్యానవనంలో జీవవైవిద్యాన్ని ప్రతిబింబించేలా పాండిచ్చేరికి చెందిన యూనివర్సల్ ఎకో ఫౌండేషన్ నిపుణులచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్కులో భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో గడపడంతో పాటు... శేషాచల అడవుల్లో ని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతుల వివరాలను తెలుసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతరించిపోతున్న అరుదైన జీవరాసుల ఆకృతులను కళ్లకు కట్టేలా తయారు చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ పనులన్నీ పూర్తయితే శిలాతోరణం మరింత మంది సందర్శకులను ఆకర్షించనుంది.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.