రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయటం వివాదాస్పదమవుతోంది. అయినా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలోని చెక్‌పోస్టుకు వైకాపా రంగులు వేశారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెదపరిమి గ్రామ పంచాయతీ పరిధి సమీపంలోని రోడ్డుపై రెండు రోజుల క్రితం పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. దీనికి కొందరు వైకాపా జెండా రంగులు వేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుకు రాజకీయ పార్టీ రంగు ఎవరు వేశారు..ఎందుకు వేశారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: