గుంటూరు జిల్లాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న కోడి పందేల్లో వైకాపాలోని రెండు వర్గాలు గొడవకు దిగాయి. భట్టిప్రోలు మండలం పల్లెకోనలో బరుల వద్ద ఘర్షణ జరిగింది. వేమూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బొల్లిముంత ఏడుకొండలుపై కొందరు దాడికి దిగారు. వెంటనే ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అడ్డుకుని గొడవ పెద్దది కాకుండా చూశారు. గురువారం జరిగిన ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఈ కోడి పందాలు జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగిన కోడి పందాలు నేటితో ముగిశాయి.
ఇదీ చదవండి: సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు గాయం కాకూడదని..