ETV Bharat / state

వాట్సాప్ గ్రూప్​లో అశ్లీల వీడియోలు.. వ్యక్తిపై కేసు నమోదు - నిజాంపట్నం అశ్లీల వీడియోల కేసు వార్తలు

విద్యార్థులకు ట్యూషన్ చెప్పే అతను చెడు దారి పట్టాడు. అశ్లీల వీడియోలను అధికార పార్టీ స్థానిక వాట్సాప్ గ్రూప్​లో పోస్టు చేశాడు. ఈ వ్యహారం పోలీసుల దృష్టికి చేరటంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ycp activist posted naked videos in whats app group

author img

By

Published : Jul 12, 2020, 3:34 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు పోస్టు చేయటం సంచలనం కలిగించింది. సంబంధిత వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ ఫిర్యాదుతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. కారకుడిని గుడారయ్యా(26)గా పోలీసులు గుర్తించారు. వైకాపా కార్యకర్త అయిన ఇతను.. ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు. అశ్లీల వీడియోలను స్థానిక పార్టీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. సంబంధిత వీడియోలు ఓ యువతికి చెందినవిగా ప్రచారం జరగటంతో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

వీడియోల వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది. వీడియోలు పోస్టయిన వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ను పోలీస్‌ స్టేషన్​కు పిలిపించి విచారించారు. అడ్మిన్ ఇచ్చిన ఫిర్యాదుతో గుడారయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. నిందితుడు గుడారయ్య ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్​గా పని చేస్తూనే... పాఠశాల విద్యార్థినులకు ఇంటి వద్ద ట్యూషన్ చెబుతూ ఉంటాడు. అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. వైరల్ అయిన వీడియోలు సదరు వ్యక్తే చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి

భార్యను ఇంట్లో బంధించి నరకం చూపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.