ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో అంశాల అమలు తెలుగుదేశానికే సాధ్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. మోదీ, కేసీఆర్, జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసులమాఫీ, అక్రమాస్తుల కాపాడుకోవడం మీదే జగన్ దృష్టి ఉందని విమర్శించారు. అందుకే కేసీఆర్, మోదీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇలాంటివారికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. వైకాపాకు ఓటేస్తే మోదీకి, కేసీఆర్కు వేసినట్లేనన్నారు. జగన్అధికారంలోకి వస్తేప్రాజెక్టులకు గండి కొట్టుకున్నట్లు అవుతుందని చెప్పారు.
ఏపీకి హోదా ఇవ్వనన్న మోదీకి... ఆంధ్రకు హోదా ఇస్తే, తమకూ ఇవ్వాలన్న కేసీఆర్కు జగన్ ధన్యవాదాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి జలాలను కేసీఆర్కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ నుంచి జగన్ వెయ్యి కోట్లు బయానాగా తీసుకున్నారని దుయ్యబట్టారు. మోదీకి కేసీఆర్, జగన్ కుడి, ఎడమ భుజాలుగా మారారని విమర్శించారు. ముగ్గురూ కలిసి రాష్ట్రంపై దాడి చేస్తున్నారనీ.. కుట్ర రాజకీయాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి..