Yanamala Letter on AP Financial Position: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు.. మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుకుడు యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్డిసిప్లెయిన్ (ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం)పై కాగ్ నివేదిక అంశాలను లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులూ చేశామని, నిబంధనలు పాటించామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ.. కాగ్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలపై యనమల ప్రశ్నించారు.
Yanamala Letter to AP Financial Special Principal Secretary SS Rawat: కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలంటూ నిలదీశారు. అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరిన వైనాన్ని వివరించారు. ఈ వివరాలపై ప్రభుత్వ పరంగా పూర్తి సమాధానం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 పాలనలో 1.39 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసిందని తెలిపారు. ఎఆర్బీఎం పరిమితికి లోబడి మాత్రమే నాడు టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని అన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల కన్నా వైసీపీ ప్రభుత్వం రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని ఆరోపించారు.
Yanamala Fires on AP Debts: లక్ష కోట్లు అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు చేసినట్లు కాగ్ తన నివేదికలో గణాంకాలతో సహా నిర్ధారించిందన్నారు. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికే 1లక్షా 18వేల 003 కోట్లు అని కాగ్ తేల్చిందని అన్నారు. ఇవి కాక 18 వేల కోట్ల మేరకు విద్యుత్ సంస్థల బకాయిలు, లెక్కలు చూపని సాగునీటి, తాగునీటి రంగాల పెండింగ్ బిల్లులు, పంచాయితీ సంస్థల నుంచి తీసుకున్న 20 వేల కోట్లు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన బకాయిలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లను దాటిందని ఆరోపించారు.
Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం
Andhra Pradesh Debts: మితిమీరిన అప్పుల కారణంగా 2024 సంవత్సరంలో 42 వేల కోట్లు అప్పులుగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం దేశంలో సగటున 14 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 9 శాతం మాత్రమే ఉందని అన్నారు. ట్రెజరీతో సంబంధం లేకుండా కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాల ఆధారంగా కేంద్రం నుంచి ఎక్కువ అప్పులకు అనుమతి పొందిందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.
AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..
AP Debts 2023: అప్పు చేయడంలో తగ్గేదేలే!.. అంటున్న జగన్ సర్కార్
"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు