ETV Bharat / state

'బాలల్లో స్ఫూర్తి నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమం' - world Childers celebrations understate woman commission

'కిడ్స్ టేకోవర్ కార్యక్రమం' స్ఫూర్తితో బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విదార్థినిలకు కమిషన్​ ఒక్కరోజు ఛైర్​పర్సన్, సభ్యులుగా బాధ్యతలు అప్పగించారు.

world Childers celebrations at Guntur
బాలలో స్ఫూర్తి నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమం
author img

By

Published : Nov 20, 2020, 5:23 PM IST

Updated : Nov 20, 2020, 6:50 PM IST

బాలల్లో స్ఫూర్తి నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమం

ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కిడ్స్ టెకోవర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనాథ విద్యార్థినీలకు ఒక్కరోజు ఛైర్ పర్సన్, కమిషన్ సభ్యులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ.. విలు విద్యలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఇంటర్​ విద్యార్థిని కన్నెపొటి జోత్స్నను కమిషన్ చైర్​పర్సన్​గా నియమించారు. ఈ సందర్బంగా విద్యార్థినులు సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టులో వచ్చి గుంటూరులోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని కమిటీ సభ్యులతో కలసి కన్నెపొటి జోత్స్న ప్రతిజ్ఞ చేశారు.

పిల్లల్లో స్ఫూర్తిని నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమాన్ని చేపట్టామని కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విలు విద్యలో ప్రతిభ చూపిన బాలికను ఛైర్​పర్సన్‌గా నియమించి మహిళల రక్షణ కోసం కమిషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించామన్నారు. కిడ్స్ టేకోవర్ కార్యక్రమ స్ఫూర్తితో బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు.

మహిళలకు రక్షణ కల్పిస్తామని ఒక్కరోజు ఛైర్​పర్సన్ కన్నెపొటి జోత్స్న అన్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులకు అండగా ఉంటామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఆడపిల్లలను పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకునే తల్లిదండ్రులలో మార్పు రావాలన్నారు. అబ్బాయితో సమానంగా ఆడపిల్లలను చదివించాలన్నారు. మహిళలకు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిత సంస్థ నిర్వహకులు, నవజీవన బాలభవన్ నిర్వాహకులు, మహిళా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

Last Updated : Nov 20, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.