గుంటూరు జిల్లా వినుకొండ పురపాలకలో 10వ వార్డుకు రీకౌంటింగ్ నిర్వహించాలని తెదేపా అభ్యర్థి పుండ్ల నరసింహారావు డిమాండ్ చేశారు. 10 వార్దులో నేను గెలిస్తే వైకాపా అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశామని.. ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం రీకౌంటింగ్‌కు నిరాకరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఫలితాల వెల్లడిలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని.. తనకు న్యాయం చేయాలని బాధితుడు ఎన్నికల సంఘాన్ని కోరారు.
వినుకొండలోని 10వార్డు ఫలితంపై రీకౌంటింగ్‌కు నిరాకరించడాన్ని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఖండించారు. తెదేపా అభ్యర్థి గెలిస్తే.. 7 ఓట్లతో వైకాపా అభ్యర్థి విజయం సాధించినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: