విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, రైతులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. తామంతా పార్టీ వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. పేదలకు ఇన్ని చేసినా ఓడిపోవడం ఏమిటయ్యా అంటూ వాపోయారు. ఎప్పుడూ పని పని అని పరితపిస్తే పని చేసేవాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి రోజులు వస్తాయి, అందరూ ధైర్యంగా ఉండి నిబ్బరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, నందిగామ తెదేపా అభ్యర్ధి తంగిరాల సౌమ్య, కృష్ణా జిల్లా తెలుగు మహిళా నేత ఆచంట సునీత, నరసాపురం ఎంపీ అభ్యర్ధి శివరామ రాజు, కాకినాడ అభ్యర్ధి కొండబాబు తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఇవీ చదవండి