ETV Bharat / state

రెండో వివాహమే.. ఆమె హత్యకు కారణమా..? - ఈరోజు మహిళ దారుణ హత్య వార్తలు

గుంటూరు జిల్లా ఓబుల నాయుడుపాలెంలో మహిళ హత్యకు గురికావటం సంచలనం రేపింది. కొంత కాలం క్రితం హత్యకు గురైన మహిళ మరో వర్గానికి చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్తి తగాదాలతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Woman murdered in Obula Naidupalem
ఓబుల నాయుడుపాలెంలో మహిళ హత్య
author img

By

Published : Dec 1, 2020, 10:52 AM IST

గుంటూరు నగర శివారు ఓబుల నాయుడుపాలెనికి చెందిన ఏమినేడి వాణిశ్రీ (48) దారుణ హత్యకు గురయ్యింది. చౌడవరం పరిధిలోని దాసరిపాలెం గ్రామానికి చెందిన ఆమె కొంత కాలం క్రితం ఏమినేడి చెన్నయ్య గౌడ్​ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం కావటం.. భర్త తరఫు బంధువులతో తరుచు ఆస్తి విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. వీరికి కుమారుడు జన్మించిన అనంతరం గొడవలు మరింత పెద్దవి అయ్యాయి. ఈ విషయమై వాణిశ్రీ గత నెలలో నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

స్పందించిన పోలీసులు.. వివాదానికి సంబంధించిన పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంతలో.. వాణిశ్రీ హత్యకు గురైంది. రాత్రి 7 గంటల సమయంలో కొందరు యువకులు ముసుగులు వేసుకొని వచ్చి కత్తులతో దాడి చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ ఘటన ఆస్తి వివాదం కారణంగానే జరిగిందా? మరేదైనా అంశం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇవీ చూడండి:

రక్తహీనత బాధితుల గుర్తింపులో జాప్యం.. యాభై శాతం కూడా దాటని సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.