గత నెలరోజులుగా భర్త బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. అత్తమామలు భర్తను కాపురానికి రానీయకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సాక్షాత్తు హోంమంత్రి సుచరిత ఇలాకాలోనే యువతికి అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడంలేదంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె భర్తను స్టేషన్ కి పిలిచి మాట్లాడుతున్నారు.
ప్రేమించాడు...పెళ్లి చేసుకున్నాడు..కానీ అంతలోనే! - ప్రత్తిపాడులో భర్త ఇంటిముందు నిరసనకు దిగిన భార్య
ఇద్దరు ప్రేమించుకున్నారు...పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు..ఎమైందో తెలియదు కాని పెళ్లైనా 17రోజులకే భార్యను విడిచి వెళ్లిపోయాడు. దీంతో భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది.
ప్రేమించాడు...పెళ్లి చేసుకున్నాడు..కానీ అంతలోనే!
గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన దారం బాజిబాబు అదే గ్రామానికి చెందిన గుడిపాటి భార్గవి లతలు ప్రేమించుకున్నారు. పెళ్లికి భార్గవిలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించినప్పటికి..ప్రియుడి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలో కొంతమంది పెద్దల సమక్షంలో ఏప్రిల్ 24న వివాహం చేసుకున్నారు. 17 రోజులు కలిసి ఉన్న తరువాత అమ్మానాన్నకు బాగోలేదని వెళ్లిన బాజిబాబు ఇక తిరిగి రాలేదు. ప్రేమించి పెళ్లిచేసుకొని కాపురానికి రాకపోవడంతో భర్త ఇంటి ముందు భార్గవిలత బైఠాయించి న్యాయ పోరాటానికి దిగింది.ఇదీ చదవండి:
గత నెలరోజులుగా భర్త బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. అత్తమామలు భర్తను కాపురానికి రానీయకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సాక్షాత్తు హోంమంత్రి సుచరిత ఇలాకాలోనే యువతికి అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడంలేదంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె భర్తను స్టేషన్ కి పిలిచి మాట్లాడుతున్నారు.
ఇదీ చదవండి:
పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం