బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణా, కర్ణాటక తదితర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారినట్లు వివరించింది. పశ్చిమ, తూర్పు కోస్తా తీర ప్రాంతాలతో పాటు చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. రాగల 3 - 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
నదుల్లోకి భారీగా వరద నీరు
భారీ వర్షాల కారంగా రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు భారీగా చేరుతున్నట్లు నీటి పారుదల అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి 80 వేల 520 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 53 వేల 457 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: