ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కోటి రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామని గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి చందు రామారావు ప్రకటించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ బోధన సిబ్బంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని రామారావు అన్నారు. వారిని ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తన సొంత నిధులతో రెండు నూతన శాశ్వత భవనాలు నిర్మించి ఉపాధ్యాయులకు అంకితం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే వారికి నివేశన స్థలాలు, బీమా ఇప్పించేందుకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఫెడరేషన్ సహకారంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడుతున్నట్లు తెలిపారు. తనకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం