గుంటూరు జిల్లా మాచర్ల దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతామని తెలుగుదేశం నేత బొండా ఉమ తెలిపారు. వైకాపా నేతల దాడికి నిరసనగా... 72 గంటల నిరసన దీక్ష చేస్తానని బొండా ఉమ ప్రకటించారు. మాచర్ల ఘటనపై డీజీపీ వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. నిందితులను వదిలేసి తమ కాల్‌డేటా దర్యాప్తు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ప్రశాంతంగా ఉన్న ఏపీని మరో బిహార్‌లా మార్చారని విమర్శించారు. గతంలో తాము ఇలానే దాడులు చేస్తే ప్రతిపక్ష నేతలు రోడ్లపై తిరగగలిగేవారా అని ప్రశ్నించారు.
సంబంధిత కథనం:'మాచర్ల ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు'