ETV Bharat / state

పవన్ కల్యాణ్ సీఎం కావాలి... మాకు న్యాయం జరగాలి - అమరావతి రైతుల ఆందోళన

వైకాపా సర్కారు తీరుతో తమ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోందని పవన్ కల్యాణ్​ ఎదుట ఓ మహిళ గోడు వెళ్లబోసుకుంది. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సీఎంగా జగన్​ తమకు వద్దొని చెప్పింది.

'We do not want Jagan as Chief Minister' a Woman said in front of Pawan
పవన్ ముందు మహిళ ప్రసంగం
author img

By

Published : Dec 31, 2019, 5:37 PM IST

వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ మహిళా రైతు
రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 14రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారి మద్దతు తెలిపేందుకు ఇవాళ రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించారు. ఎర్రబాలెంలో మహిళా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళ రైతు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సర్కారు నిర్ణయాల వల్ల తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ తమకు వద్దొని ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలని డిమాండ్ చేసింది. లేదంటే తాము చచ్చిపోతామని గద్గగ స్వరంతో చెప్పింది. అమరావతే రాజధానిగా కొనసాగించాలని కోరింది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని... తమకు న్యాయం చేయాలని ఆకాంక్షించింది.

ఇదీ చదవండి:అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.