రేషన్ డీలర్‌పై వార్డు వాలంటీర్ దాడి చేసిన ఘటన గుంటూరులో జరిగింది. నగరంలోని బ్రాడిపేట 2/19 లో ఉన్న 33వ నంబరు రేషన్ దుకాణాన్ని కృష్ణంరాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న వార్డు వాలంటీర్ అజయ్ రేషన్ సరకులు కోసం చౌకధరల దుకాణం వద్దకు వెళ్లాడు. లైన్లో రమ్మని డీలర్ సూచించగా.. ఆగ్రహానికి గురైన అజయ్ రేషన్ డీలర్‌పై దాడి చేశాడు. కృష్ణంరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వార్డు వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.