గుంటూరు జిల్లా ఈపూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ యోహాను భార్య దయమ్మ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. సమీపంలోని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పురుగులమందు డబ్బాను లాక్కుని విసిరేశారు. పదేళ్ల క్రితం కొనుక్కున్న 6 సెంట్ల భూమిని వేరే వ్యక్తి పేరుతో సర్వేయరు రికార్డుల్లోకి ఎక్కంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పార్టీ అంటగడుతున్నారని.. ఓ రాజకీయ నేత ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఇలా తమ భూమిని వేరే వ్యక్తి పేరున బదలాయించారని విమర్శించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ.. నమ్మించాడు.. నగలు దోచుకొని చంపేశాడు