గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రూబియా బేగం.. పట్టణంలోని 20వ వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే డీఈడీ ఆఖరి సంవరత్సరం పరీక్షల నిమిత్తం.. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలకు తన భర్త ఫణిదరపు అశోక్ కుమార్‌తో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. చిలకలూరిపేట రోడ్డులోని ఓవర్ బ్రిడ్జ్ పైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో రూబియా బేగం తీవ్రంగా గాయపడటంతో.. జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రూబియా బేగం ఇవాళ మృతి చెందినట్లు.. రెండోపట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: