ETV Bharat / state

VIRAL FEVERS: తండాలో విషజ్వరాలు.. ఆందోళనలో గ్రామస్థులు - Guntur District Latest News

కృష్ణా, గుంటూరు జిల్లాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గుంటూరు జిల్లా కొచ్చర్ల తండాలో తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. తండాలో 37 మందికి జ్వరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా వెంపటిగూడెంలో కూడా జనం జ్వరాల బారిన పడుతున్నారు.

విషజ్వరాలు
viral fevers
author img

By

Published : Aug 10, 2021, 6:03 PM IST

కృష్ణా, గుంటూరు జిల్లాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలం కొచ్చర్ల తండాలో మూడ్రోజుల కిందట తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్య సిబ్బంది తండాలో 56 మందికి మలేరియా పరీక్షలు నిర్వహించగా..37 మందికి జ్వరాలు ఉన్నట్లు తేలింది. ప్రతి ఇంట్లో ఒంటి నొప్పులు, జ్వరంతో జనం బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. డెంగ్యూ లక్షణాలుగా కొంత మందిలో కనిపిస్తున్నాయన్నారు.

అటు కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం వెంపటిగూడెంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆశా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో గ్రామాన్ని సందర్శించిన ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి నరసింహ నాయక్ పరిస్థితులను పరిశీలించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

  • గ్రామస్థులు, వైద్య సిబ్బంది సమాచారం మేరకు కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ డి.నాగేంద్రబాబు ఈ రోజు తండాలో రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

గ్రామంలో 56 మందికి మలేరియా పరీక్షలు చేయడం జరిగింది. కరోనా, డెంగ్యూ పరీక్షలు చేస్తాము. ఇప్పటికే గ్రామంలో కొందరు కరోనా పరీక్షలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయించుకున్నారు. ఆ రిపోర్టులలో అందరికీ నెగిటివ్ వచ్చింది . కీళ్ల నొప్పులు, జ్వరం, ఒళ్లు నొప్పులు.. డెంగ్యూ లక్షణాలుగా అనుమానిస్తున్నాము. ఇప్పటికే గ్రామ పంచాయతీలో శానిటేషన్, బ్లీచింగ్ చల్లించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

:డాక్టర్ డి.నాగేంద్ర బాబు, కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుంటూరు జిల్లా

గ్రామంలో విష జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్థులు ప్రైవేట్ వైద్యులపై ఆధారపడే పని లేకుండా రెడ్డిగూడెం ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాము.

: నరసింహ నాయక్, రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి, కృష్ణా జిల్లా

పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థలను సత్వరమే మెరుగుపరచి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాము.

:మల్లాది రాణి, రెడ్డిగూడెం సర్పంచ్

ఇదీ చదవండీ.. సీఐపై మహిళ ఫిర్యాదు.. లైంగిక వేధింపుల కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.