ETV Bharat / state

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు - guntur district news

గుంటూరు జిల్లా తెనాలిలోని హనుమన్ పాలెంలో గ్రామస్థులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ఇసుక లారీలు రాకపోకలతో తమ గ్రామం ఇసుకతో నిండిపోతుందని..రోడ్లు శిధిలమైపోతున్నాయని మండిపడ్డారు. దుమ్ము ధూళితో తమ ఇల్లు కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

villagers blocked sand lorries
గ్రామంలోంచి ప్రయాణిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న ప్రజలు
author img

By

Published : May 9, 2021, 11:27 PM IST

గుంటూరు జిల్లా.. కొల్లిపర మండలం హనుమంపాలెంలో ఇసుక లారీలు తమ గ్రామంలోకి రాకూడదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఏడు రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నా..ఏ అధికారి ఇక్కడికి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు తమ ఊరులో నుంచి వందలాది ఇసుక లారీలు ప్రయాణిచండం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో రోడ్లు దెబ్బతిన్నాయని.. ధూళి లేవకుండా కనీసం రోడ్లపై నీటిని కూడా చల్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయంటూ గ్రామస్తులు వాపోతున్నారు.

ప్రతిరోజు రోడ్డుపై కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలుస్తున్నాయంటున్నారు. ప్రధానంగా మండల పరిధిలో అత్తులూరిపాలెం, వళ్లబాపురం, మున్నంగి, పిడపర్తి పాలెం, కొల్లిపరలోని 2 క్వారీలు, కొత్తబొమ్మవాని పాలెంలోని 3 క్వారీలు, అన్నవరంలోని 2 క్వారీలు.. మొత్తం 11 క్వారీల లారీలన్నీ హనుమంపాలెం గ్రామం మీదుగా వెళ్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు అంటున్నారు.

అధికారులు ఈ లారీల రాకపోకలపై కనీసం చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 18 టన్నుల లారీలో 30 టన్నుల ఇసుక తరలిస్తున్నా.. అధికారులు చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. రోజూ 1500 లారీలు తిరుగుతుంటాయని..ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వీటిపై తక్షణం చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఏమిటీ ముంబయి మోడల్‌.. కరోనా వేళ ఏం చేసింది?

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. గరిష్ఠంగా నమోదవుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.