గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని పొత్తూరులో ఓట్లు తోలగించారని ఆరోపిస్తూ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను ఓటు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు. 900 ఓట్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్నికల అధికారులు అక్కడి పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు పరిశీలన కోసం రాగా.. వారిని నిలదీశారు. ఈ అంశం తమ పరిధిలోనిది కాదని అధికారులు వారికి నచ్చజెప్పారు. గ్రామస్తులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శివారు గ్రామాలను ఇటీవలే నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఈ క్రమంలో పొత్తూరు, నాయుడుపేటను కలిపి 26వ వార్డుగా ప్రకటించారు. తొలిసారి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వచ్చింది. కానీ ఓట్ల తొలగింపుతో అందరూ నివ్వెరపోయారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా ఓట్లు వేశారు.
ఇదీ చూడండి: