గుంటూరు జిల్లాలో ఓటర్లను గ్రామ వాలంటీర్లు ప్రలోభాలకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చండూరు మండలంలోని కేఎన్ పాలెం పంచాయతీకి మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా.. వైకాపా మద్దతుదారుల తరపున వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ అధికార పార్టీ తరపు వారికి ఓటు వేయాలని చెబుతున్నారు.
వైకాపా మద్దతుదారులను గెలిపిస్తే.. పింఛన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని వాలంటీర్లు పేర్కొంటున్నారు. కుమ్మర్ల శ్రీకాంత్, కూరపాటి జాన్ వెస్లీ, ఊరబండ శ్రీనివాసరావులు.. గ్రామస్థులను ప్రలోభాలకు గురి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. స్థానికులే వీటిని చిత్రీకరించారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. పలుచోట్ల వైకాపాకు మద్దతుగా ఇలా వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి: