విజయవాడలో బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును.. డిశ్చార్జ్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. శరీరంలో పలుచోట్ల కత్తిపోట్లు ఉండగా.. రోగ నిరోధకశక్తి బాగా తగ్గిందని వెల్లడించారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చి వైద్యం చేస్తున్నామని పేర్కొన్నారు.
నాగేంద్రబాబు పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపనున్నారు. హత్యకు గల కారణాలు అతని ద్వారానే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఆ యువతి మృతి.. ఒక మిస్టరీగానే మిగలనుంది.
ఇదీ చదవండి: పోలీసుల పేరుతో వసూళ్లు..ఐదుగురు అరెస్ట్