గుంటూరు నగరం చంద్రమౌళినగర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ప్రాంగణం వద్ద విజయ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రారంభించారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించటంలో విజయ డెయిరీ ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాడి రైతులకు లాభం చేకూర్చటంతో పాటు వినియోగదారులకు మంచి ఉత్పత్తులు అందిస్తామన్నారు. కృష్ణాజిల్లాలో తమకు 1600 విక్రయ కేంద్రాలున్నాయని ఇకపై గుంటూరులోనూ విస్తరిస్తామని డెయిరీ ఎండీ బాబూరావు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకుని గుంటూరులో 15చోట్ల విజయ డెయిరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ: