Venkaiahnaidu: ఉన్నత పదవులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనేక అంశాలను పంచుకున్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తాను ప్రజలకు దూరమయ్యానని, ఒకప్పటిలా తరచుగా అన్ని కార్యక్రమాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని కొందరు కోరుకుంటున్నారని... భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. దేశాన్ని శక్తివంతంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని వెంకయ్య స్పష్టం చేశారు.
పాఠశాల వజ్రోత్సవాల్లో..
సమాజం కోసం పాటుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే కొందరు విద్యను వ్యాపారంగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారని.. ఇది సరైన విధానం కాదన్నారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థులను తయారు చేయటం కూడా విద్య లక్ష్యమని తెలిపారు. తాను ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా వేషధారణ మార్చలేదని సంప్రదాయ వస్త్రాలతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని తెలిపారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తే.. ప్రపంచం మనం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. మన మాతృభాషను గౌరవించుకోవాలని.. తనతో పాటు దేశ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతా మాతృభాషలో చదివినవాళ్లమేనని వెల్లడించారు.
ఇదీ చదవండి: