ETV Bharat / state

'ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి చేసింది వారే..!' - వెలగపూడిలో రైతుల ధర్నా

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వాహనంపై దాడికి పాల్పడింది.. ప్రైవేటు వ్యక్తులేనని అమరావతి రైతులు ఆరోపించారు. పోలీసులు వద్దని వారించినా.. ఎమ్మెల్యే పిన్నెల్లి కావాలనే రైతులు నిరసన చేస్తున్న చోటికి వచ్చారన్నారు. రాజధాని కోసం 8 మంది చనిపోతే... సర్కారు కనీసం స్పందించలేదని ఆవేదన చెందారు. రాజధాని కోసం పోరాడితే.. జైళ్లల్లో పెడతారా అని నిలదీశారు. వెలగపూడిలో 22వ రోజూ రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Velagapudi farmers protest continuous on 22th day
వెలగపూడిలో రాజధాని రైతులు ధర్నా
author img

By

Published : Jan 8, 2020, 5:20 PM IST

వెలగపూడిలో రాజధాని రైతులు ధర్నా
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడి ముమ్మాటికీ ప్రైవేటు వ్యక్తుల పనేనని అమరావతి రైతులు స్పష్టం చేశారు. వైకాపా నేతలతో దాడి చేయించి రైతులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు వద్దని చెప్పినా... ఎమ్మెల్యే పిన్నెల్లి ఉద్దేశపూర్వకంగానే నిరసన ప్రదేశానికి వచ్చారన్నారు. ప్రైవేటు వ్యక్తులే దాడికి పాల్పడ్డారంటూ ఫొటోలు విడుదల చేశారు. వెలగపూడిలో 22వ రోజూ రైతు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.

రైతులు చనిపోతే స్పందన లేదు

రాజధాని తరలిపోతోందనే ఆందోళనతో ఇప్పటికే 8 మంది చనిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందని.. ప్రశ్నించారు. న్యాయం అడిగితే జైళ్లల్లో పెడుతున్నారన్న వారు... అన్నదాతలను అరెస్టులు చేయమని ఏ చట్టం చెప్పిందని నిలదీశారు. ఓ ఎమ్మెల్యే కారుపై దాడి జరిగితే వైకాపా నేతలంతా... హడావుడి చేస్తున్నారే... 27 వేల మంది రోడ్లపై నిరసన చేస్తుంటే... ఒక్క ఎమ్మెల్యే సైతం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.