గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని తహసీల్దార్ ప్రభాకర్ దాడులు క్రేన్‌తో పాటు 6 టిప్పర్ లారీలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. గొడవర్రు గ్రామం నుంచి పెదకాకాని మండలం తంగెళ్లమూడి వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సంఘటనా స్థలంలో ఆగి తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా మట్టి తరలింపు సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎంత మేర తవ్వారు అనేది మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చూడండి. రేపే విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం