ETV Bharat / state

హాథ్రాస్​ ఘటన: గుంటూరు, ప్రకాశం జిల్లాలో నిరసనలు - హాథ్రాస్​ ఘటనపై గుంటూరు జిల్లాలో నిరసన

హాథ్రాస్​ ఘటనపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వివిధ సంఘాల వారు నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్​ చేశారు. అలాగే అత్యాచారానికి గురైన మహిళ కుటుంబానికి అక్కడి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

protest over hatras incident
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో హాథ్రాస్​ ఘటనపై నిరసన
author img

By

Published : Oct 9, 2020, 1:05 PM IST

ప్రకాశం జిల్లా

యూపీలో అత్యాచారానికి గురై మృతి చెందిన ఎస్సీ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ యర్రగొండపాలెం అంబేడ్కర్​ యువజన సంఘం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. పుల్లల చెరువు సెంటర్​ నుంచి ప్రదర్శనగా వచ్చి.. అంబేడ్కర్​ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేశారు.

గుంటూరు జిల్లా

హాథ్రాస్​లో ఎస్సీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ మాచర్లలో గురువారం రాత్రి ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అగ్రవర్గాల మహిళలకు అన్యాయం జరిగితే స్పందించే ప్రభుత్వాలు, అణగారిన వర్గాల మీద హత్యాచారాలు జరిగితే స్పందించడం లేదని ఎమ్మార్పీఎస్​ నియోజకవర్గ అధ్యక్షుడు రూబే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.

ఇదీ చదవండి :

'హాథ్రాస్​ ఘటన కారకులను ఉరి తీయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.