ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ముక్కోటి ఏకాదశి పూజలు

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Dec 25, 2020, 12:14 PM IST

Vaikunta Ekadashi pujas
గుంటూరులో ముక్కోటి ఏకాదశి

చిలకలూరిపేటలో భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా చిలకలూరిపేటలోని లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళా భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి.. ఉత్తర ద్వార గుండా స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేయటంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

బాపట్లలో గరుడ వాహనంపై స్వామివారు..

బాపట్లలో తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం దేవాలయాల్లో భక్తులు బారులు తీరారు. పట్టణంలోని శ్రీ సుందరవల్లి, రాజ్యలక్ష్మి సమేత క్షిర భావన్నారాయణ స్వామి దేవాలయంలో గరుడ వాహనంపై అమ్మవార్లతో కలిసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పానకాల లక్ష్మినరసింహస్వామి వైకుంఠ ద్వార దర్శనం..

మంగళగిరి పానకాల లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. వైకుంఠ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి శంకుతీర్థాన్ని అధికారులు రద్దు చేశారు.

వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి..

తెనాలిలోని వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

ఇవీ చూడండి...

ప్రత్యేకత చాటుకున్న కళాకారులు... ఆటోమొబైల్​ వస్తువులతో జీసస్ ప్రతిమ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.