మే 28-2020 నాటికి సొంతంగా ఆటో,టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లాంటి వాహనాలు కలిగిఉన్న వాహన యజమానులు, డ్రైవర్లు మే నెలలో వాహన మిత్రకి అప్లై చేయని వారికి ఈనెల 24 వ తేదీ వరకూ గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించిందని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇవ్వాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూలై 4న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పదివేల రూపాయలు జమ చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని డీటీసీ మీరా ప్రసాద్ కోరారు.
ఇదీ చూడండి ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం