ETV Bharat / state

ఉప్పల్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌.. టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే? - ఉప్పల్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌

Uppal IND vs NZ match Tickets :ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ఉప్పల్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులను కలిశారు. మ్యాచ్‌ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

one day match
వన్డే మ్యాచ్‌
author img

By

Published : Jan 11, 2023, 9:06 PM IST

Uppal IND vs NZ match Tickets: హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులను కలిశాడు. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్లు అజారుద్దీన్‌ తెలిపారు. 18న ఉప్పల్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో అజారుద్దీన్ సమావేశమై.. మ్యాచ్‌ ఏర్పాట్లపై చర్చించారు.

ఇటీవల తెలంగాణలోని ఉప్పల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ టికెట్ల జారీ విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న సగటు ప్రేక్షకులు నిరాశ చెందారు. జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్‌ ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా హెచ్‌సీఏ జాగ్రత్త పడుతుందని తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.