గుంటూరు జిల్లా వినుకొండలోని రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ షేక్ మహబూబ్ సుభాని భార్య మల్లికా బేగంపై.. అగంతకులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అదేసమయంలో సుభాని విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలనలో ఉండగా.. ఒక్కసారిగా కేకలు వినిపించటంతో బయటకు వచ్చారు. అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్యను చూసి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఛాతీ, ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయలవ్వటంతో.. తీవ్రంగా రక్త స్రావం అయినట్లు చెప్పారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సీఐ రమేష్ బాబు, ఎస్సై సింగయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. Vaccination: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్