గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో 65 ఏళ్ల వృద్ధురాలిని శుక్రవారం సాయంత్రం ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. బలహీనంగా, ఆరుబయటే ఉన్న వృద్ధురాలిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది చలించిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో.. దేనికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఆమె ఉంది. అనారోగ్యంతో ఉన్న విషయాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందించే ప్రయత్నం చేశారు.
తన మనసుకు తగిలిన గాయంతో వృద్ధురాలు రాత్రంతా ఏడుస్తూనే ఉందని సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహం ఆసుపత్రిలోనే ఉంది. ఆచూకీ తెలియకపోవటంతో గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు రికార్డుల్లో నమోదు చేశారు. ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం అందించాలని ఎస్సై నజీర్ బేగ్ కోరారు.
ఇవీ చదవండి...