గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వ బాధితులకు పునరావాస శిభిరాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , తెదేపా నేత కళా వెంకట్రావు సందర్శించారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారని, పిన్నెల్లిలో 200 మందిపై ఒక్కొక్కరి మీద 4 అక్రమ కేసులు పెట్టారని అన్నారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థికసాయంగా అందిస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఉన్నత విద్య కల్పిస్తామని వెల్లడించారు. గ్రామాలను వీడిన వారిని ఈ నెల 11 నాటికి తిరిగి వారిని గ్రామాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెదేపా కార్యకర్తలకు రక్షణ కల్పించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి.పోలవరం పునరావాస లెక్కలపై కేంద్రం ఆరా