తెదేపా నేతలు కులవివక్ష చూపుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. గుంటూరులోని వైకాపా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా తెదేపా నేతలు వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో గతంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నందుకే తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య చేసిన వ్యాఖ్యలను శ్రీదేవి తప్పుపట్టారు. తాను ఎస్సీ కులస్థురాలు కాదని నిరూపిస్తే తదుపరి చర్యలకు కట్టుబడి ఉంటానని సవాల్ విసిరారు. తనపై కులవివక్షత చూపడం మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: