గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని 23వ వార్డులో జరిగిన ఈ ఘటనలో చిన్నారుల చిన్నాన్నే ఈ ఘటనకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే..
కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి దంపతులకు పార్ధీవ్ (10) రోహిత్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా రేపల్లె పట్టణంలోని అమ్మమ్మ ఇంటికి పిల్లలను తీసుకొచ్చి 4 నెలలుగా వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. పిన్ని, బాబాయ్ శ్రీనివాసరావు కూడా లాక్డౌన్ వల్ల పిల్లలతో కలిసి మరో ఇంటిలో ఉంటున్నారు. పార్ధీవ్, రోహిత్ ఆడుకుంటుండగా చిన్నాన్న శ్రీనివాసరావు తను నివాసం ఉండే ఇంటిలోకి తీసుకెళ్లి చెక్కలతో తలపై కొట్టి హత్యచేశాడు. గమనించిన స్థానికులు పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. నిందితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు...గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు తెలిపారు. ఇరు కుటుంబాలకు ఎలాంటి పాత కక్ష్యలు, ఆస్తి తగాదాలు లేవని...అయితే చంపడానికి కారణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కొద్ది రోజులుగా నిందితుడికి మతిస్థిమితం సరిగా లేక వైద్యం చేయించుకుంటున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: