ప్రమాదవశాత్తు చెరువులో మునిగి.. ఇద్దరు యువకులు మృతి - two youngsters died in a pond accidentally
గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఎడ్ల బండి కడగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి
చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగింది. చెరుకుపల్లి గ్రామానికి చెందిన రవితేజ (21), మోహన్ కృష్ణ (16) ఎడ్ల బండిని కడగడానికి ఊరి చివర ఉన్న చెరువుకెళ్లారు. ఎడ్ల బండిని నీటిలోకి దించి కడుగుతుండగా ప్రమాదవశాత్తూ బండి పక్కకు ఒరిగిపోయింది.
బండిపై ఉన్న యువకులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాక నీళ్లల్లో మునిగి చనిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీశారు. అప్పటికే యువకులు ఇద్దరూ మృతి చెందారు. బండి కడిగేందుకు వెళ్లి మృత్యువాత పడ్డ కుమారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: