గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు, అన్నా చెల్లెల్లైన.. కార్తిక్, గీతికలు ఉక్రెయిన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి క్షేమ, సమాచారంపై తల్లి శ్రీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ పిల్లలలను క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గీతిక రొమేనియా బార్డర్ వద్దకు చేరుకొని అక్కడ శిబిరంలో తల దాచుకుందని, కార్తీక్ ఇంకా కీవ్ పట్టణంలోనే ఉన్నారని తల్లి శ్రీదేవి చెప్పారు.
గీతిక ఉంటున్న ప్రదేశంలో వలసలు ఎక్కువగా పెరగడంతో తోపులాటలు జరిగాయని వీడియో కాల్ ద్వారా వివరించారు. ఈ తోపులాటలో తనకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. రొమేనియా భారత రాయబార అధికారులు తమకు ఆశ్రయం కల్పించాలని తెలిపారు. తమన వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించారు.
ఇదీ చదవండి:
కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్ ట్వీట్