చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను గుంటూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో దొంగతనాలకు పాల్పడిన వారిని.. మంగళగిరి మండలం చినకాకానిలో పట్టుకున్నారు. వారి నుంచి బంగారం, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దొంగలు నుంచి వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని సబ్ కలెక్టర్కు వినతిపత్రం