గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. తెనాలి చెందిన శంకరరావు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు భీమినేనివారిపాలెం వెళ్లాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకరరావుతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి గాయపడ్డారు. స్థానికులు సమాచారం ఇచ్చినా 108 ఆంబులెన్స్ రావడం లేటు కావడంతో కారులో ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి మండలం ఫణిదాంకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి వాహనానికి లైట్లు లేకపోవడం, వేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...