గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో వేర్వేరు చోట్ల రెండు ప్రమాదాలు జరిగాయి. రాత్రి సమయంలో రాంభోట్లవారి పాలెం గ్రామం వద్ద సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏసుబాబు రెడ్డి(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
చెరుకుపల్లి ప్రధాన రహదారిలో సైకిల్ పై వెళ్తున్న అర్జున రావు(65) అనే వ్యక్తిని క్రేన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్జునరావు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. గంటల వ్యవధిలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...