గుంటూరు జిల్లా ఇస్సపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకు వస్తున్న ఏపీ 07 సీఈ 6336 నంబర్ గల కారు... ఇస్సపాలెం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నకిరేకల్లు మండలం గుళ్లపల్లికి చెందిన గోపు శ్రీనివాసరెడ్డి, దేచవరానికి చెందిన కొండా వెంకటేశ్వరరెడ్డి మృతిచెందారు. పాపిరెడ్డి, కరిముల్లా, షేక్ శిలార్, వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని నరసరావుపేట రూరల్ ఎస్సై షఫీ తెలిపారు.
ఇదీ చదవండీ... మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ