ETV Bharat / state

కరోనా కల్లోలం.. భార్యాభర్తలు మృతి.. చికిత్స పొందుతున్న పిల్లలు - corona deaths in guntur district

సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇంట్లో ఒక్కరికి వైరస్​ సోకినా.. అందరినీ చుట్టేస్తోంది. మరోవైపు ప్రాణాలూ తీసేస్తోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో కుటుంబంలో నలుగురు వ్యక్తులు కొవిడ్​ బారిన పడ్డారు. భార్యాభర్తలు మరణించగా.. వారి పిల్లలిద్దరూ చికిత్స పొందుతున్నారు.

corona deaths
కరోనా మరణాలు
author img

By

Published : May 9, 2021, 8:34 PM IST

కరోనా.. కుటుంబాల్ని విషాదంలో ముంచేస్తుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కొవిడ్​ బారిన పడ్డారు. భార్యాభర్తలు మృతి చెందగా.. వారి పిల్లలిద్దరూ చికిత్స పొందుతున్నారు.

కొవిడ్​తో పోరాడి.. తనువు చాలించి:

సాతులూరు గ్రామంలోని ఎస్సీ కాల‌నీకి చెందిన‌ అమ‌ర్ల‌పూడి మ‌నోహ‌ర్ ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుంటాడు. అత‌నికి క‌రోనా సోకింది. త‌ర్వాత భార్య‌, కుమార్తె, కుమారుడు కూడా కొవిడ్​ బారిన పడ్డారు. మ‌నోహ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4వ తేదీన మ‌ర‌ణించాడు. అతని భార్య దీన‌కుమారి గుంటూరు జీజీహెచ్‌లో నేడు త‌నువు చాలించింది. వారి కుమార్తె, కుమారుడు ఇద్దరూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుమారుడికి ఆక్సిజ‌న్‌ అందిస్తుండగా.. కుమార్తె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది.

ఇదీ చదవండి: పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎస్పీ భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.