Troubles for Dead Body Transportation : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలకు పెట్టింది పేరు. ప్రత్యేక వైద్య చికిత్సల కోసం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాల నుంచి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు రోజుకు వేల సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారు. కొవిడ్ తర్వాత GGHకు రోగులు సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు 3 నుంచి 4 వేల మంది వివిధ వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో రోజుకు 20 నుంచి 30 మంది మృతి చెందుతున్నారు. GGHలో ఈ మృతదేహాలను తరలించేందుకు సరిపడా మహాప్రస్థానం వాహనాలు లేకపోవడంతో వారి బంధువులు అవస్థలు పడుతున్నారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధతో పాటు వారి మృతదేహాలను తీసుకెళ్లే మార్గం లేక అగచాట్లు తప్పడం లేదు.
సుమారుగా 30 మంది చనిపోతున్నారు : "గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోజురోజుకు ఓపీలు పెరుగుతున్నాయి. చావు బతుకుల మధ్య చాలా మంది ఆసుపత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పేషెంట్స్ ఇక్కడకు వస్తున్నారు. రోజుకు కనీసం 30 మంది అనారోగ్యంతో చనిపోతుండంతో 15 వాహనాలు కావాల్సిన అవసరం ఉంది. నేను ఈ అవసరాన్ని గుర్తించి అధికారులకు, కలెక్టర్‌కు చెప్పాను.డాక్టర్ కిరణ్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్
అంతులేని మరణాలు.. ఆగకుండా దహనాలు..!
Mahaprasthanam Vehicle Services at GGH Guntur : రోగుల సంఖ్యతో పాటు చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య పెంచమని మహాప్రస్థానం నిర్వాహణ సంస్థ ఇంట్రిగేటెడ్ హెల్త్ కేర్‌ను సంప్రదించినా సానుకూల ఫలితం రాలేదని జీజీహెచ్ వైద్య వర్గాలు తెలిపాయి. దానికితోడు రాత్రి సమయాల్లో చనిపోయిన వారిని తీసుకెళ్లడం కుదరదని ఖరాఖండిగా చెబుతుండటంతో మృతదేహాన్ని స్వస్థలాలకు ఎలా తరలించాలో కుటుంబసభ్యులకు దిక్కుతోచడం లేదు.
GGHలో 15 మహాప్రస్థానం వాహనాల అవసరం ఉండగా 7 మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అందులోనూ ఒకటి, రెండు మరమ్మతులకు గురికావడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వాసుపత్రి అవసరాలకు అనుగుణంగా 24 గంటలు, ఏ ప్రాంతానికైనా మృతదేహాల్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది : ఆసుపత్రిలో చనిపోయిన వారిని వారి ఇంటికి తీసుకెళ్లడానికిి మహాప్రస్థానం ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. నాకు తెలిసి ప్రభుత్వం మహాప్రస్థానం కార్యక్రమాలకు అడ్డంకులు కలిగిస్తుంది. రాత్రి సమయాల్లో చనిపోయిన వారిని తీసుకెళ్లడం కుదరదని ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రైవేటు అంబులెన్సులు చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు." డాక్టర్ కిరణ్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్