School staff negligence: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం... ఆయా ఏమరుపాటుతో ఆరేళ్ల బాలుడు తాళాలు వేసిన గదిలో మూడు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా బాపట్ల గ్రామీణ మండలం చెరువు గ్రామంలోని పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బడికి వెళ్లిన బాలుడు సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాఠశాలకు వచ్చి చూడగా బాలుడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. బాబు తరగతి గదిలో ఏడుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో హడావుడిగా ఆయాను పిలిపించి తాళాలు తెరిచారు. అప్పటికే దాదాపు మూడు గంటల పాటు బాలుడు చందు లోపలే ఉండిపోయాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: చంటి బిడ్డ ఆసుపత్రిలో ఉన్నా..సేవారుసుం వసూలుకు ఒత్తిడి.. కన్నీటిపర్యంతమైన కార్యదర్శి