కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతిని విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. రాష్ట్రానికి అరుణ్‌జైట్లీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు
ఆయన చేసిన సేవలు మరువలేనివి: రావెల
అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని భాజపా నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. గుంటూరు భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అరుణ్ జైట్లీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అమరావతి రాజధాని విషయంలో అరుణ్ జైట్లీ సేవలు అమోఘమన్నారు. అమరావతి రైతులకు క్యాపిటల్ గైన్స్, టాక్స్ లు లేకుండా చేశారన్నారు.
ఇదీ చదవండి: