ETV Bharat / state

ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం.. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ కార్డుల వారికి అందని వైద్యం - ఆరోగ్యశ్రీ కార్డులపై అందని వైద్యం

కరోనా మహమ్మారి ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన యాజమాన్యాలు డబ్బులు కడితేనే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, పేదల ఆరోగ్యశ్రీ కార్డులతో వెళ్తే పడకలు ఖాళీ లేవని తిప్పి పంపుతున్నారు. ఒకవేళ ఆస్పత్రిలో చేర్చుకున్నా చికిత్స సరిగా అందించటం లేదని రోగులు వాపోతున్నారు.

ఆరోగ్యశ్రీ, ఉద్యోగ కార్డుల వారికి అందని వైద్యం

author img

By

Published : Apr 23, 2021, 7:12 AM IST

ఆరోగ్యశ్రీ, ఉద్యోగ కార్డుల వారికి అందని వైద్యం

రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు జిల్లాలో పేదలకు ప్రైవేట్ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్‌కార్డులపై గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. కొవిడ్ రోగులు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను చికిత్స కోసం ఎంపిక చేసింది. 24 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు.. 21 ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్ వైద్యం అందించేందుకు అనుమతి ఇచ్చింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పేద వర్గాలు ఉచితంగా కరోనాకు చికిత్స తీసుకోవచ్చు. అయితే చాలాచోట్ల కార్డులతో వచ్చిన వారిని చేర్చుకోవటం లేదు. పడకలు ఖాళీ లేవనే ఆస్పత్రి వర్గాల నుంచి సమాధానం వస్తోంది. నెట్ వర్క్ ఆసుపత్రులు కొవిడ్ చికిత్స అందిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే బిల్లులు మంజూరవుతాయి. అదే పడకలు కార్డుదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే తమ ఇష్టానుసారం వసూలు చేసుకోవచ్చు.

పెదకాకానికి చెందిన ఓ వ్యవసాయ కూలికి పాజిటివ్‌ రాగా గుంటూరు బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై చేరారు. 3 రోజుల పాటు కనీసం పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. మంగళవారం రాత్రి తీవ్ర ఆయాసంతో శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిపడటంతో అప్పుడే వైద్యం అందించారన్నారు. గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైతం ఇదే అనుభవం ఎదురైంది. డబ్బులు చెల్లించి ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రం వైద్యం అందిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు సైతం కొవిడ్‌తో ముందువరుసలో ఉండి పోరాడుతున్నారు. కనీసం అలాంటి వారికైనా ఆరోగ్యకార్డులపై వైద్యం అందించడం లేదు. పడకలు లేవని మరో ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యపరంగా ఇతర సమస్యలున్నవారు.. 45ఏళ్లు దాటినవారు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్తున్నారు. కానీ అక్కడ వైద్యం అందించకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీచదవండి.

శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు

బెంగాల్‌లో రోడ్‌ షోలపై ఈసీ నిషేధం

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం..10,759 కేసులు, 31 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.