నాగార్జునసాగర్‌లో పర్యాటక బోట్ల నిర్వహణకు సంబంధించి గుంటూరు జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కంట్రోల్ రూంలలో ఇది ఒకటని కలెక్టర్ తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోటు బయలుదేరే ముందే అన్ని రకాలుగా పరిశీలించటంతో పాటు... నదిలోకి వెళ్లిన తర్వాత కూడా జీపీఆర్ఎస్ వ్యవస్థ ద్వారా కదలికలను పర్యవేక్షిస్తారని వివరించారు.
పర్యాటకుల భద్రత కోసం కంట్రోల్ రూం ఏర్పాటు !
నాగార్జునసాగర్‌లో పర్యటించే వారి భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు కలెక్టర్ వెల్లడించారు. పర్యాటక బోట్ల నిర్వహణకు సంబంధించి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.